ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే
కొత్త జాబితా ప్రకారం దేశంలోని 130 జిల్లాలను రెడ్ జోన్లుగా, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్‌లుగా, 319 జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా కేంద్రం గుర్తించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 ఆరెంజ్ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్‌స్పాట్(రెడ్‌జోన్).. తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్ హాట్‌స్పాట్స్‌గా.. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా పేర్కొంటారనే విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వివరాలు జిల్లాల వారీగా..
రెడ్ జోన్: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం
గ్రీన్ జోన్: విజయనగరం.