ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న మద్యం షాపులు.

అమరావతి: ఏపీలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్‌ భార్గవ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను పంపించామని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. కేవలం ఐదుగురినే అనుమతిస్తామని పేర్కొన్నారు.షాపుల ముందు సర్కిల్‌ కూడా ఏర్పాటు చేస్తామని.. మాస్క్‌ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆ షాపులను కొంత సమయం మూసేస్తామని తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్ల బయట మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను తగ్గించేందుకే ధరలు పెంచామని రాజత్‌ భార్గవ్‌ వెల్లడించారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )