శీతన్న గార్డెన్స్ రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ …..

కరోనా కేసు నమోదైన జీవీఎంసీ 51 వ వార్డు పరిది మాధవధార శీతన్న గార్డెన్స్ రెడ్ జోన్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ శనివారం మద్యాహ్నం పర్యటించారు .
ఈమేరకు రెడ్ జోన్ ప్రాంతంలో జీవీఎంసీ , పోలీస్ అదికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు .
శీతన్న గార్డెన్స్ వద్ద కరోనా కేసు నమోదు కావడంతో ఆయా ప్రాంతం లో నివాసముంటున్న ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన సూచనలివ్వాలని అధికారులను ఆదేశించారు .
రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామ/వార్డు వాలంటీరులతో సమయానికి నిత్యవసర వస్తువులు అందజేసే విదంగా చర్యలు చేపట్టాలని వివరించారు . ఎప్పటికప్పుడు పరిస్టిస్తులను సమీక్షించాలని జీవీఎంసీ జోన్ -4 కమిషనర్ పి.సింహచలం అలాగే వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి జి.స్వరూప రాణి కి సూచించారు .
అంతకుముందు రక్షణ చర్యలను పరిశీలించిన ఆయన
సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటా సర్వే ను నేరుగా పరీక్షించారు .

ఇదిలా ఉండగా ఇటివలే శీతన్న గార్డెన్స్ ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అదికారులు అప్రమత్తమయ్యారు . ఆమే భర్త ఆనారోగ్యంతో బాధపడుతూ నగరంలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు . అప్పటికి అతడికీ పరిక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నేగిట్యూ అని నిర్ధారించారు .ఇదిలా వుండగా అతడి భార్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో అదికారులు అప్రమతమయ్యారు . ఇప్పటికే మృతుని అంతక్రియలకు హజరైన పలువురిని అదికారులు కోరంటైన్ లో వుంచి వైధ్య పరిక్షలు నిర్వహించారు .

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )