స్కాలర్షిప్ కావాలి అంటే ఫీజులు కట్టాల్సిందే…!
విద్యార్థులు అభ్యున్నత కన్నా లాభర్జనే ధ్యేయంగా పనిచేస్తిన్న ప్రైవేట్ విద్యాసంస్థలు.కరోనా లాక్ డౌన్ సమయం లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థలతో పాటు విద్యాసంస్థ కూడా దెబ్బతిన్న పరిస్థితి అందరికి తెలిసిందే , అన్ని రంగాలు వ్యవస్థలు తో పాటు విద్యాసంస్థ కూడా ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతుంది.
విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నుండి ఎటువంటి ఫీజులు వసూళ్లు చేయరాదు అంటూ స్కాలర్షిప్ నిలిపివేయ్యారదు అంటూ మార్గదర్శికలు జారీ చేసిన ప్రైవేట్ విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అటు విద్యార్థులను ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు పై ఫీజుల పేరుతో మనోవేదనకు గురిచేస్తున్నాయి.
విశాఖ నగరంలో పెరు పొందిన ఒక విద్యాసంస్థ ప్రభుత్వ అదేశాలను పట్టించుకోకుండా విద్యార్థులు కి రావాల్సిన స్కాలర్షిప్లను ఎరగా వేసి ఫీజులు కట్టాలి అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను తీవ్ర ఒత్తిడి కి గురిచేస్తున్నారు
ఒక పక్క ప్రభుత్వం ఫీజులతో సంబంధం లేకుండా స్కాలర్షిప్ ఇవ్వాలి అని ప్రభుత్వం చెప్తున్న ఇటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు పై ఒత్తిడి తీసుకొస్తు విద్యార్థులు జీవితాలు తో ఆటలు ఆడుకుంటున్న ఇటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వం ని అభ్యర్ధన చేశారు.